బ్రేకింగ్ : జగన్ వచ్చాక తొలికేసు సీబీఐకి

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి సీబీఐకి యరపతినేని శ్రీనివాసరావు కేసును అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. పల్నాడులో గనుల అక్రమ తవ్వకాల అక్రమాలపై సీబీఐకి అప్పగించాలని [more]

Update: 2019-09-04 06:55 GMT

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి సీబీఐకి యరపతినేని శ్రీనివాసరావు కేసును అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. పల్నాడులో గనుల అక్రమ తవ్వకాల అక్రమాలపై సీబీఐకి అప్పగించాలని జగన్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీబీఐని ఏపీకి రాకుండా అడ్డుకుంటూ జీవోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే జగన్ వచ్చాక సీబీఐని నిరోధిస్తూ తీసుకున్న చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. దీంతో సీబీఐ విచారణకు ఏపీలో మార్గం సుగమమయింది. ఇప్పటికే ఏపీ హైకోర్టు యరపతినేని శ్రీనివాసరావు అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని వ్యాఖ్యానించడంతో జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. రాజకీయ వేధింపుల ఆరోపణలకు చెక్ పెట్టాలనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Tags:    

Similar News