మరో పెద్ద హామీ అమలుకు జగన్ రెడీ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తాను ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళుతున్నారు. నేడు మరో హామీని జగన్ అమలు చేయనున్నారు. వైఎస్సార్ ఆసరా పథకాన్ని నేటి నుంచి [more]

Update: 2020-09-11 02:52 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తాను ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ వెళుతున్నారు. నేడు మరో హామీని జగన్ అమలు చేయనున్నారు. వైఎస్సార్ ఆసరా పథకాన్ని నేటి నుంచి అమలు చేయనున్నారు. పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉన్న రుణాన్ని చెల్లించనున్నారు. మొత్తం నాలుగు దశల్లో ఈ రుణాన్ని చెల్లిస్తారు. దీంతో మొత్తం 87,74,674 మంది మహిళలు లబ్ది పొందనున్నారు. మొత్తం 27, 168 కోట్ల రూపాయల రుణాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది. తొలి విడతగా నేడు 6,792 కోట్లను నేడు పొదుపు సంఘాల ఖాతాల్లో జమ చేయనుంది. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి కార్యాలయం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. మొత్తం వారం రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Tags:    

Similar News