బ్రేకింగ్ : జగన్ ఉల్లాసంగా ఉత్సాహంగా బయటకు

ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ ముగిసింది. దాదాపు నలభై అయిదు నిమిషాల పాటు వీరి భేటీ సాగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం [more]

Update: 2020-10-06 06:08 GMT

ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ ముగిసింది. దాదాపు నలభై అయిదు నిమిషాల పాటు వీరి భేటీ సాగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రధానికి జగన్ వివరించినట్లు సమాచారం. అలాగే కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటుందని జగన్ మోదీకి తెలిపారు. దీంతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మోదీకి జగన్ వివరించారు. ఏపీకి రావాల్సిన పెండింగ్ బకాయీలపై చర్చించారు. దీంతో పాటు రాజకీయ అంశాలు కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రధాని నివాసం నుంచి బయటకు వచ్చిన జగన్ ఉల్లాసంగా ఉత్సాహంగా కన్పించారు.

Tags:    

Similar News