Breaking : వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్

వైసీపీ హైకమాండ్ సీరియస్ డిసిషన్ తీసుకుంది. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎ్మెమ్యేలను సప్పెండ్ చే'rgdr

Update: 2023-03-24 11:45 GMT

వైసీపీ హైకమాండ్ సీరియస్ డిసిషన్ తీసుకుంది. నిన్న ఎమ్మెల్సీ ఓటింగ్ లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎ్మెమ్యేలను సప్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆనం రామనారా‍యణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై చర్యకు దిగింది. వైసీపీ అధినాయకత్వం నలుగురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఎమ్మెల్యేలను గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది.

కోట్లు పోసి కొనుగోలు చేశారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారని వైసీపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఒక్కొక్కొరిని పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. తమ అంతర్గత దర్యాప్తులో ఈ విష‍యం వెల్లడయిందన్నారు. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకు వారిపై చర్యలు తీసుకున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.


Tags:    

Similar News