తుఫాను బాధితులకు వైసీపీ భారీ సహాయం

Update: 2018-10-15 08:04 GMT

తిత్లీ తుఫానుతో చిన్నాభిన్నమైన శ్రీకాకుళం జిల్లాను ఆదుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. పార్టీ తరపున తుఫాను బాధితులకు రూ. ఒక కోటి ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఇప్పటికే వైసీపీకి చెందిన రెండు బృందాలు తుఫాను బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని పార్టీ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ... తుఫాను బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని యన విమర్శించారు.

చంద్రబాబు విఫలం.....

ప్రజలు అల్లాడుతుంటే చంద్రబాబు మాత్రం పబ్లిసిటీ కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. తుఫాను ప్రభావ ప్రాంతంలో లీటరు పెట్రోల్ రూ.150కి, 20 లీటర్ల మంచినీటిని రూ.100కి, ఒక కోడిగుడ్డు రూ.10కి అమ్ముతున్న దారుణ పరిస్థితులు ఉన్నాయని, 40 ఏళ్ల చంద్రబాబు అనుభవం ఏం చేస్తుందనే ఆయన ప్రశ్నించారు.

Similar News