పవన్ కు ఫ్రెష్ లడ్డూలందాయా?

బిజేపి,జనసేన పార్టీలు ఓట్లు, సీట్లు ప్రభావితం చేయలేని పార్టీలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. రాజకీయ కూటములు రాజకీయాల్లో సర్వసాధారణమని, ఎన్నికల సమయంలో ఇది సాధారణంగా [more]

;

Update: 2020-01-16 12:52 GMT

బిజేపి,జనసేన పార్టీలు ఓట్లు, సీట్లు ప్రభావితం చేయలేని పార్టీలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. రాజకీయ కూటములు రాజకీయాల్లో సర్వసాధారణమని, ఎన్నికల సమయంలో ఇది సాధారణంగా అంబటి పేర్కొన్నారు. ఏడు నెలల్లోనే ఈ ప్రభుత్వం విఫలమయిందని విమర్శించడమేంటన్నారు. రాజకీయాల్లో, వ్యక్తిగతంగా స్థిరత్వం లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని అంబటి రాంబాబు విమర్శించారు. ఒక్కో లైబ్రరీలో కూర్చుని పుస్తకాలు చదివితే ఒక విధంగా భావజాలం అనిపిస్తోందని, మరి ఆయనకు ఒక్కో విధంగా అనిపించడంలో తప్పు లేదని అంబటి అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ వంటి వ్యక్తిని పెట్టుకుని కుక్కతోక పట్టుకుని గోదారి ఈదుతానంటే తమకేం నష్టం లేదన్నారు. పాచిపోయిన లడ్డూలని మోడీపై ధ్వజమెత్తిన పవన్ కు ఇవాళ జీడిపప్పు,కిస్ మిస్ తో ఫ్రెష్ లడ్లు పంపారా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశానని చెప్పుకునే పవన్ హోదా అడక్కుండా బేషరతుగా ఎందుకు కలసిపనిచేస్తానని హామీ ఇచ్చారో ఏపీ ప్రజలకు చెప్పాలన్నారు. పవన్ కల్యాణ్ బీజేపీ, టీడీపీతో కలిసి పనిచేశారని, ఆ తర్వాత టీడీపీ తో దూరంగా ఉన్నట్లు నటించారని, వామపక్షాలతో కలిశారని, రాజకీయ స్థిరత్వం లేని పవన్ ఒక పార్టీతో దీర్ఘ కాలం ఉన్నారా? అని ప్రశ్నించారు.

Tags:    

Similar News