రాజుగారి విందుకు అన్నీ రెడీ

రేపు రాత్రికి వైసీపీ పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజు పార్లమెంటు సభ్యులందరికీ రుచికరమైన విందు ఇస్తున్నారు. ఢిల్లీలోని జన్ పథ్ వద్ద లాన్స్ ఆఫ్ వెస్ట్రన్ కోర్టులో రఘురామకృష్ణంరాజు [more]

Update: 2019-12-10 08:42 GMT

రేపు రాత్రికి వైసీపీ పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజు పార్లమెంటు సభ్యులందరికీ రుచికరమైన విందు ఇస్తున్నారు. ఢిల్లీలోని జన్ పథ్ వద్ద లాన్స్ ఆఫ్ వెస్ట్రన్ కోర్టులో రఘురామకృష్ణంరాజు గోదావరి రుచులతో విందు ఇవ్వనున్నారు. రేపు రాత్రి 8 గంటలకు ఈ విందు ప్రారంభం కానుంది. ఈ విందును గతంలో కాంగ్రెస్ రాజ్యసభ సభ సభ్యుడు, తన వియ్యంకుడు కేవీపీ రామచంద్రరావు ఇంట్లో ప్లాన్ చేశారు. కానీ చివరి నిమిషంలో దీని వెన్యూను రఘురామకృష్ణంరాజు మార్చారు. లాన్స్ ఆఫ్ వెస్ట్రన్ కోర్టులో ఈ విందు ఉంటుందని రఘురామ కృష్ణంరాజు మరో ఇన్విటేషన్ ఎంపీలకు పంపారు.

ఎన్ని ఐటమ్సో……

అన్ని పార్టీలకు చెందిన ఎంపీలకు రఘురామ కృష‌్ణంరాజు ఆహ్వానం పంపారు. ఈ విందులో నోరూరించే అన్ని వంటకాలను రాజుగారు సిద్ధం చేశారు. విజిటేరియన్ తో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఇప్పటికే ప్రిపేర్ చేయడానికి ఏపీ నుంచి వంటగాళ్లు ఢిల్లీ వచ్చారు. వంట సామగ్రిని కూడా స్పెషల్ ఫ్లైట్ లో తీసుకువచ్చారు. నాటుకోడి చికెన్, పులుసు, రొయ్యల కూర, పులుసు, మటన్ ఫ్రై, చేపల పులుసు, రాగి సంకటి, కౌజుపిట్టల మాంసంతో పాటు అనేక రకాల స్వీట్లు ఉన్నాయని చెబుతున్నారు. మరి రేపు రాత్రికి జరిగే ఈ విందుకు ఎవరెవరు హాజరవుతారన్నది చూడాలి.

Tags:    

Similar News