నంద్యాల ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో వైసీపీలో గెలిచి టీడీపీలో ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనే డిమాండ్ తెరపైకి రావడంతో మంత్రి ఆదినారాయణ రెడ్డి ధీటుగా స్పందించారు. నంద్యాల ఓటమికి బాధ్యత వహించి జగన్‌తో సహా ., ప్రజా ప్రతినిధులంతా రాజీనామాలు చేస్తే తాము కూడా ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారు. జగన్ వల్ల తాము గెలవలేదని., జగన్ వల్లే తాము గెలిచి ఉంటే విశాఖలో విజయమ్మ., కడపలో వివేకా ఎందుకు ఓడిపోతారని ఎద్దేవా చేశారు. నంద్యాల ఫలితంతోనైనా జగన్ వెంట ఉన్న నాయకులు కళ్లు తెరుచుకోవాలని., వైసీపీ మునిగిపోయే నావ అని విమర్శించారు.