బాబు కమిటీ మధ్యంతర నివేదిక

Update: 2016-12-28 06:48 GMT

డిజిటల్ చెల్లింపులపై కేంద్రప్రభుత్వానికి ముఖ్యమంత్రుల కమిటీ మధ్యంతర నివేదిక ఇవ్వనుంది. డిజిటల్ చెల్లింపుల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి? నగదు రహిత చెల్లింపులు ఏ విధంగా చేయాలన్నదానిపై కమిటీ కేంద్రానికి సిఫార్సు చేయనుంది. అందులో భాగంగా బుధవారం ఢిల్లీలో సీఎంల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ పనగరియ, సీఈవో అమితాబ్ కాంత్ హాజరయ్యారు. ఈ సమావేశానికి మిగిలిన ముఖ్యమంత్రులు రాలేదు. అయినా సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తుంది. తాము తీసుకున్న నిర్ణయాలను సిఫార్సుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందజేయనున్నారు.

Similar News