Cyclone Effect : హమ్మయ్య.. పెను ప్రమాదమే తప్పింది.. ఇక వర్షాలే

ఆంధ్రప్రదేశ్ లో వాయుగుండం తీరం దాటినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేదు.

Update: 2024-10-17 05:31 GMT

Cyclone status in AP today

ఆంధ్రప్రదేశ్ లో వాయుగుండం తీరం దాటినప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేదు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఫ్లాష్ ఫ్లడ్స్ కు కూడా అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగంతో సహా అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వాయుగుండం తుపానుగా మారలేదు. తీరం దాటడంతో అల్పపీడనంగా మారడంతో కొద్ది పాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.భయపెట్టి సైలెంట్ గా తడ సమీపంలో తీరం వాయుగుండం తీరం దాటింది.అల్పపీడన, వాయుగుండ ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

రాకపోకలకు అంతరాయం...

వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అక్కడక్కడ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. సంగం బ్యారేజ్ 12 గేట్లు ఎత్తి పెన్నా బ్యారేజ్ కి 7,500 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సోమశిల జలాశయానికి 21, 841 క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది.ప్రస్తుత జలాశయ నీటిమట్టం 53.825 టిఎంసీలుగా ఉంది. నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.నాలుగు రోజులు పాటు కురిసిన వర్షాలకు అనంతసాగరం, సోమశిలలో నారుమళ్లు దెబ్బతిన్నాయి.ఉదయగిరి నియోజకవర్గం లో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి.నిన్నటివరకు ఎగసి పడిన సముద్రపు అలలు నేడు సైలెంట్ అయ్యాయి.
భయపడినట్లుగా...
వాయుగుండం తుపానుగా మారి తీవ్ర ప్రభావం చూపుతుందని అందరూ భయపడ్డారు. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, రాయలసీమలోని అన్నమయ్య, సత్యసాయి, కడప జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా సంభవించే అవకాశముందని అనుకున్నారు. కానీ తుపాను గా మారకముందే వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారడంతో పెను ప్రమాదమే తప్పినట్లయిందని అధికారులు తెలిపారు. అయినా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారు తమ సొంత ఇళ్లకు తరలివెళుతున్నారు. తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Tags:    

Similar News