భూమాకి మోదీ అభినందనలు

Update: 2017-08-28 11:00 GMT

నంద్యాల ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ట్విట్టర్ లో బ్రహ్మానంద రెడ్డిని అభినందించిన మోడీ., టీడీపీ గెలుపుని తమ విలువైన భాగస్వామి చంద్ర బాబు నాయుడు సాధించిన విజయంగా అభివర్ణించారు. నిజానికి దేశం లో మూడు చోట్ల జరిగిన ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలే విజయం సాధించాయి. ఢిల్లీ ఆప్., గోవా లో ముఖ్యమంత్రి పారికర్ విజయం సాధించారు. పారికర్ కు కూడా అభినందనలు తెలిపిన మోడీ నారా చంద్రబాబు నాయుడుని టాగ్ చేసి తమ విలువైన భాగస్వామి సాధించిన విజయంగా పేర్కొన్నారు. తాజా ట్వీట్ మోదీ అంతరంగానికి అద్దం పడుతోంది. ఇటీవల టీడీపీ తో తమ మైత్రి కొనసాగుతుందని బీజేపీ జాతియాధ్యక్షుడు చేసిన ప్రకటనకు ఇది కొనసాగింపుగా భావించవచ్చు.

Similar News