Ukraine Crisis : ఈ యుద్ధం భారత్ చావుకొచ్చినట్లే

ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ప్రభావం భారత్ పై కూడా తీవ్రంగా ఉండనుంది

Update: 2022-02-25 06:28 GMT

India : కరోనా వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. ఆర్థిక వ్యవస్థ కొద్దిగా పుంజుకుంటుంది. సామాన్యుడి కొనుగోలు కొంత పెరుగుతున్న తరుణంలో ఉక్రెయిన్ - రష్యా యుద్ధం భారత్ లోని సామాన్యుల చావుకు వచ్చినట్లే ఉంది. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ఈ యుద్ధం ప్రభావం భారత్ పై కూడా తీవ్రంగా ఉండనుంది. ధరలు విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయి. నిత్యావసరాలతో పాటు పెట్రో ఉత్పత్తుల ధరలు కూడా భారీగా ఉన్నాయి.

ద్రవోల్బణం....
ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశముందని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు. స్టాక్ మార్కెట్టలో సయితం ఒడిదుడుకులు కనిపించే అవకాశం ఉందంటున్నారు. దీనివల్ల భారత్ లో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశముంది. పెట్రోలియం ఉత్పత్తిలో ప్రపంచంలోనే మూడో అతి పెద్ద దేశం రష్యాకాగా, వ్యవసాయ రంగం లో ప్రధానమైన దేశం ఉక్రెయిన్. ఈ రెండు దేశాల మధ్య యుద్ధంతో ధరలు ఆకాశాన్నంటే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
అన్ని ధరలు...
ముఖ్యంగా భారత్ లో గ్యాస్ ధరలు పెరిగే అవకాశముంది. ఇప్పటికే ముడిచమురు ధర బ్యారెల్ కు వంద డాలర్లు దాటింది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముంది. భారత్ ఇతర దేశాల నుంచి పెట్రో ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. అందువల్లనే ఈ యుద్ధంతో భారత్ లో చమురు ధరలు మరింత పెరగనున్నాయి. మొత్తం మీద కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్ కు ఉక్రెయిన్ - రష్యాల యుద్ధంతో ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడం ఖాయమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.


Tags:    

Similar News