Ukrain War : కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు.. కీవ్ నుంచి బయటపడండి
ఉక్రెయిన్ లో ఉంటున్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది
ఉక్రెయిన్ లో ఉంటున్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను భారతీయులు తక్షణం వదిలిపెట్టాలని కోరింది. కీవ్ నగరంలో ఏ క్షణమైనా ఏదైనా జరగొచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వెనువెంటనే కీవ్ ను వదిలి బయటకు రావాలని కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్న వారిని కోరింది. కీవ్ లో త్వరలో విధ్వంసం జరగవచ్చన్న సంకేతాలు భారత ప్రభుత్వానికి వచ్చాయని అంటున్నారు.
రాయబార కార్యాలయాన్ని....
అందుకే ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులను తక్షణం తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే కీవ్ లోని రాయబార కార్యాలయాన్ని భారత్ ఖాళీ చేసింది. ఉక్రెయిన్ కు సీ 17 విమానాలను పంపి తక్షణం భారతీయులును అక్కడి నుంచి తెచ్చే ఏర్పాట్లను ముమ్మరం చేసింది. దీన్ని బట్టి కీవ్ నగరంలో రష్యా సైనికులు బాంబు దాడులతో చెలరేగే అవకాశం ఉంది.