Ukraine War : కీవ్ నగరం ఖాళీ.. దాడులు తీవ్రతరం
ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో భారత రాయబార కార్యాలయాన్ని మూసివేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో భారత రాయబార కార్యాలయాన్ని మూసివేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా బలగాలు కీవ్ ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుండటంతో కీవ్ లో రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. కీవ్ లో భారతీయులు ఎవరూ లేరని, విదేశాంగ దౌత్య సిబ్బందిని వేరే ప్రాంతానికి తరలించే ప్రక్రియను చేపట్టింది. కీవ్ ను విడిచి పెట్టి వెళ్లాలని భారత రాయబార కార్యాలయం నిన్న నే భారతీయులకు హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఇరవై కిలోమీటర్ల దూరంలోనే...
మరోవైపు కీవ్ నగరానికి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో రష్యా బలగాలు చేరుకున్నాయి. నివాస భవనాలపై కూడా దాడులు జరుగుతున్నాయి. క్షిపణులతో దాడికి దిగుతుండటంతో బహుళ అంతస్థుల భవనాలు సయితం నేలమట్టమయ్యాయి. కీవ్, ఖర్కివ్ నగరాలను సొంతం చేసుకునేందుకు రష్యా చేస్తున్న దాడులను ఉక్రెయిన్ పౌరులు, సైన్యం తిప్పికొడుతున్నప్పటికీ సామాన్య పౌరులు ఇబ్బంది పడుతున్నారు. కీవ్ నగరాన్ని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా ఇప్పటికే రష్యా పౌరులకు సూచించింది.