Ukraine War : ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన
ఉక్రెయిన్ లోని భారతీయులకు విదేశాంగ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
ఉక్రెయిన్ లోని భారతీయులకు విదేశాంగ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఎవరూ సరిహద్దుల వద్దకు వచ్చేందుకు ప్రయత్నించ వద్దని తెలిపింది. ముందుగా ఎలాంటి సమన్వయం లేకుండా సరిహద్దుల వద్దకు వెళ్లే ప్రయత్నాలను భారతీయులు ఎవరూ చేయవద్దని కోరింది.
సరిహద్దులు....
భారతీయులందరూ సాధ్యమయినంత వరకూ పశ్చిమ ప్రాంత నగరాల్లోనే తలదాచుకోవాలని సూచించింది. అధికారులకు సమాచారం ఇవ్వకుండా తొందరపడి సరిహద్దులకు వెళ్లవద్దని సూచించింది. భారతీయులను వెనక్కు తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈరోజు రెండు ప్రత్యేక విమానాల ద్వారా 470 మంది భారతీయులను భారత్ కు తీసుకురానుంది. ఒక విమానం ఢిల్లీలో, మరొక విమానం ముంబయికి చేరుకునేలా ప్లాన్ చేశారు.