Ukraine War : ముగింపు దశకు యుద్ధం... చేతులెత్తేసిన ఉక్రెయిన్

ఉక్రెయిన్ ప్రభుత్వం దిగి వచ్చింది. చర్చలకు సిద్ధమంటూ సంకేతాలను పంపింది. సాగుతున్న యుద్ధానికి స్వస్తి పలకాలని కోరింది.

Update: 2022-02-25 12:09 GMT

ఉక్రెయిన్ ప్రభుత్వం దిగి వచ్చింది. చర్చలకు సిద్ధమంటూ సంకేతాలను పంపింది. రెండు రోజులుగా సాగుతున్న యుద్ధానికి స్వస్తి పలకాలని కోరింది. తాము చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ప్రకటించారు. దీంతో రెండు రోజుల క్రితం మొదలయిన యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లేనని భావించవచ్చు. ఉక్రెయిన్ సేనలు గట్టిగానే పోరాడాయి. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వారు దేశం విడిచి వెళ్లవద్దని కోరింది.

రెండు రోజుల నుంచి.....
రెండు రోజుల నుంచి ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. రష్యా బలగాల ముందు ఉక్రెయిన్ నిలవలేకపోయింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో పాటు అనేక నగరాలలోకి రష్యా సైన్యం ప్రవేశించింది. దీంతో ఉక్రెయిన్ ప్రభుత్వం చర్చలకు సిద్ధమని చెప్పింది. అయితే ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలు పడేస్తేనే తాము చర్చలకు సిద్ధమని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. మొత్తం మీద ఉక్రెయిన్ చర్చలకు సిద్ధమని ప్రకటించడంతో త్వరలోనే యుద్ధం ముగుస్తుందని భావించవచ్చు.
Tags:    

Similar News