Ukrain War : కీవ్ లో వారంతపు కర్ఫ్యూ ఎత్తివేత

ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో వారంతపు కర్ఫ్యూ ఎత్తివేశారు. అక్కడ ఉన్న భారతీయులు సరిహద్దు దేశాలకు చేరుకునే వీలు కలిగిం

Update: 2022-02-28 07:03 GMT

ఉక్రెయిన్ రాజధాని కీవ్ ప్రభుత్వం వారంతపు కర్ఫ్యూ ఎత్తివేసింది. దీంతో అక్కడ ఉన్న భారతీయులు సులువుగా సరిహద్దు దేశాలకు చేరుకునే వీలు కలిగింది. విద్యార్థులు ప్రయాణించడానికి ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. వీరు ఆ రైళ్లలో ఉచితంగా ప్రయాణించే వీలు కల్పించింది.

పశ్చిమ ప్రాంతంలోని....
అయితే విద్యార్థులు పశ్చిమ ప్రాంతంలో ఉన్న రైల్వే స్టేషన్లకు వెళ్లి అక్కడి నుంచి సరిహద్దు ప్రాంతాలకు చేరుకోవాలని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. సరిహద్దు దేశాలకు చేరుకుంటే అక్కడి నుంచి భారత్ కు సులువుగా చేరుకోవచ్చని సూచించింది. కీవ్ లో కర్ఫ్యూ ఎత్తివేయడంతో అక్కడ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న భారతీయులకు కొంత వెసులుబాటు దొరకింది. ఇప్పటికే ఐదు విమానాల్లో భారతీయ విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం భారత్ కు తరలించింది.


Tags:    

Similar News