రష్యాను అడ్డుకునేందుకు.. ఉక్రెయిన్ ఆర్మీ ఇంజినీర్ ఆత్మాహుతి దాడి
ఉక్రెయిన్ లోకి అడుగుపెట్టేందుకు రష్యా బలగాలు క్రిమీన్ ఇస్తమస్ ప్రాంతంలో ప్రయత్నించగా.. వారిని అడ్డుకునేందుకు ఉక్రెయిన్..
ఉక్రెయిన్ : ఉక్రెయిన్ పై బాంబులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను అడ్డుకునేందుకు ఆ దేశ సైన్యం సర్వశక్తులూ ఒడ్డుతోంది. స్వయంగా దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ సైతం యుద్ధరంగంలోకి దిగారు. తమ గడ్డపై రష్యా అడుగుపెట్టకుండా అడ్డుకునేందుకు ప్రాణాలకు తెగించి పోరాడటమే కాదు.. ప్రాణాలను అర్పించేందుకు కూడా సిద్ధమయ్యారు ఉక్రెయిన్ సైనికులు. ఈ క్రమంలో ఉక్రెయిన్ ఆర్మీ ఇంజినీర్ ఒకరు రష్యా బలగాలపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.
ఉక్రెయిన్ లోకి అడుగుపెట్టేందుకు రష్యా బలగాలు క్రిమీన్ ఇస్తమస్ ప్రాంతంలో ప్రయత్నించగా.. వారిని అడ్డుకునేందుకు ఉక్రెయిన్ ఆర్మీ ఇంజినీర్ వాలోడిమీరోవిచ్ స్కకూన్ ఆత్మాహుతి దాడితో ప్రమాదం సృష్టించాడు. జెనిచెస్కీ బ్రిడ్జ్ ను మెరైన్లతో పేల్చడంలో స్కకూన్ కీలకంగా వ్యవహరించాడు. మైన్ పేల్చేముందు బ్రిడ్జి మీద నుంచి పరుగుతీయాల్సి ఉంది. ఆ ప్రమాదంలో బతికే అవకాశాలు తక్కువని తెలిసినా.. స్కకూన్ రష్యా బలగాలపై దాడి చేసేందుకు వెనుకాడలేదు. మెరైన్ల పేల్చివేతలో స్కకూన్ ప్రాణాలొదిలాడు. దేశంకోసం ప్రాణాలర్పించిన వీర సైనికుడిగా చరిత్రకెక్కాడు. 'అతని హీరోయిజంతో కూడిన ప్రదర్శన శత్రుమూకల్లో భయం పుట్టించింది. కొంతసేపటి వరకూ బలగాల్లో మార్పులు జరిగాయి' అని ఆర్మ్‌డ్ ఫోర్సెస్ జనరల్ స్టాఫ్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.