Putin : పుతిన్ రక్తం రుచి మరిగిన పులి.. పైశాచికానందంతో?
పుతిన్ నేతృత్వంలో ఇప్పటికి నాలుగు యుద్ధాలు జరిగాయంటే ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు
రష్యా అధ్యక్షుడు పుతిన్ రక్తం మరిగిన పులి లాంటి వాడు. ఆయన నేతృత్వంలో ఇప్పటికి నాలుగు యుద్ధాలు జరిగాయంటే ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఉక్రెయిన్ పై యుద్ధం పుతిన్ నేతృత్వంలో ఐదోది. యుద్ధం అంటే పుతిన్ కు మహా ఇష్టమని అంటారు. రష్యా సైనికులు యుద్ధంలో విజయకేతనం ఎగురవేస్తూ ఉంటే పైశాచిక ఆనందం పొందుతారని ఆయనకు పేరుంది.
తమదే పైచేయిగా...
ప్రపంచ దేశాల్లో తనదే పై చేయిగా ఉండాలనుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి పుతిన్. ఆయన తన అధికారం కోసం ఏకంగా రాజ్యాంగ సవరణను చేశారు. 36 ఏళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగేలా చట్టాలను మార్చుకున్నారంటే ఆయన ఏస్థాయిలో తన భవిష‌్యత్ తో పాటు, రష్యా ఎదుగుదలను ఆలోచిస్తారన్నది చెప్పకనే తెలుస్తోంది.
రష్యాను విస్తరించాలని....
రష్యాను విస్తరించాలన్న ఆకాంక్షతో ఎప్పుడూ పుతిన్ రగలి పోతుంటాడు. ఉక్రెయిన్ అంటే పుతిన్ కు మహా ప్రీతి. అందుకే ఆయన ఆలోచించి అంతర్జాతీయ సమాజం వ్యతిరేకిస్తున్నా ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవడానికి వెనకాడటం లేదు. ఇందుకు ఆయన 2021లోనే చెప్పారు. ఉక్రెయిన్ రష్యాకు కిరీటం గా ఆయన చెప్పడమే ఇందుకు ఉదాహరణ. 1999 నుంచి పుతిన్ ఏదో ఒక పదవిలోనే ఉంటూ వస్తున్నారు. ప్రధానిగా, అధ్యక్షుడిగా ఉంటూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. 2012 నుంచి ఆయన రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
కిమ్ లాగానే...
అందుకే ప్రపంచ దేశాల సలహాలను, సూచలను పుతిన్ పెడ చెవిన పెట్టారు. యుద్ధానికే మొగ్గు చూపారు. తనకు ఉక్రెయిన్ ను ఆక్రమించుకునే ఆలోచన లేదని చెప్తున్నాడు. అయితే అవి పైపైన మాటలే. ఉక్రెయిన్ ను తన అధీనంలోకి తెచ్చుకోవడమే ఆయన ముందున్న లక్ష్యం. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కు, పుతిన్ కు పెద్దగా తేడాలేదన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎక్కువగా కన్పిస్తున్నాయి.