Ukraine Crisis : ఉక్రెయిన్ లో భారతీయులు... అలెర్ట్ అయిన ఎంబసీ

ఉక్రెయిన్ లో రష్యా సైనిక ఆపరేషన్ ప్రారంభించడంతో భారత్ అప్రమత్తమయింది

Update: 2022-02-24 06:57 GMT

ఉక్రెయిన్ లో రష్యా సైనిక ఆపరేషన్ ప్రారంభించడంతో భారత్ అప్రమత్తమయింది. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించే ప్రయత్నం ప్రారంభమించింది. ఉక్రెయిన్ లో ఎక్కువగా భారతీయ విద్యార్థులు ఉంటున్నారు. గత కొద్ది రోజుల నుంచి ప్రత్యేక విమానాలతో ఉక్రెయిన్ నుంచి భారత్ కు రప్పించే ప్రయత్నం చేసింది. ఇప్పటికే రెండు ప్రత్యేక విమానాల ద్వారా భారతీయులను భారత్ కు రప్పించారు.

వెళ్లిన విమానం....
ఇంకా అనేక మంది భారతీయులు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయారు. దీంతో ఢిల్లీలోని ఎంబసీ కార్యాలయం వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దీంతో ఇండియన్ ఎంబసీ ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన వారికి కొన్ని సూచనలు చేసింది. ఎవరూ ఇళ్లను విడిచి బయటకు రావద్దని కోరింది. ఎయిర్ స్సేస్ ను ఉక్రెయిన్ మూసివేయడంతో భారతీయులను తీసుకురావడానికి వెళ్లిన విమానం కూడా తిరిగి వచ్చింది.
బయటకు రావద్దని....
ఇంకా 18 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయినట్లు ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావద్దని, ఎటువంటి ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించింది. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పింది. అయితే తమ పిల్లల సమాచారం తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీలోని ఎంబసీ కార్యాలయానికి వచ్చి ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ ఎయిర్ బేస్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించడంతో తల్లిదండ్రుల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతుంది.


Tags:    

Similar News