ఖార్కివ్ వదిలేయండి.. ఇండియన్స్ కు ఎంబసీ వార్నింగ్

ఉక్రెయిన్ లోని ఖార్కివ్ ను వదిలి బయటకు రావాలని భారత రాయబార కార్యాలయంల విద్యార్థులను కోరింది

Update: 2022-03-02 11:57 GMT

ఉక్రెయిన్ లోని ఖార్కివ్ ను వదిలి బయటకు రావాలని భారత రాయబార కార్యాలయంల విద్యార్థులను కోరింది. ఈరోజు సాయంత్రం ఆరు గంటల లోపు ఖాళీ చేయాలని ఆదేశించింది. ఆరు గంటలలోపే ఖార్కివ్ ను వదిలి వచ్చేయాలని చెప్పింది. ఖార్కివ్ పై పెద్దయెత్తున దాడులు జరిగే అవకాశమున్నందున వెంటనే ఖాళీ చేసి సరిహద్దు ప్రాంతాలకు చేరుకోవాలని భారత రాయబార కార్యాలయం కోరింది.

బాంబు దాడులతో....
గతంలోనూ కీవ్ లో ఇలాగే ఆదేశాలు జారి చేసింది. ఖార్కివ్ లో కూడా బాంబు దాడులు తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని పేర్కొంది. ఖార్కివ్ కు సమీపానికి రష్యా బలగాలు కొద్దిసేపటి క్రితం చేరుకున్నట్లు తెలిసింది. ఉక్రెయిన్ ను త్వరగా స్వాధీనం చేసుకోవాలన్న వ్యూహంతో బాంబు దాడులకు దిగే అవకాశముంది. ఉక్రెయిన్ కాలమానం ప్రకారం మరో నాలుగు గంటలలోపు ఖార్కివ్ ను ఖాళీ చేయాల్సి ఉంటుంది.


Tags:    

Similar News