రష్యాకు ఊహించని షాక్ ఇచ్చిన ఐవోసీ

ఇంటర్నేషనల్ ఒలంపిక్స్ కమిటీ రాష్యాపై నిషేధం విధించింది. ఒలంపిక్స్ లో రష్యా ఆటగాళ్ల కు నో ఎంట్రీ చెప్పింది.;

Update: 2022-03-01 03:10 GMT

ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం చేయడంతో ఇప్పటికే అనేక ఆంక్షలు విధించాయి. తాజాగా ఇంటర్నేషనల్ ఒలంపిక్స్ కమిటీ రాష్యాపై నిషేధం విధించింది. ఒలంపిక్స్ లో రష్యా ఆటగాళ్ల కు నో ఎంట్రీ చెప్పింది. రష్యాతో పాటు దానికి మద్దతిస్తున్న బెలారస్ అథ్లెట్లను కూడా ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు వీలు లేదని చెప్పింది.

క్రీడారంగానికి....
రష్యా క్రీడారంగానికి ఇది పెద్ద దెబ్బేనని చెప్పాలి. క్రీడా పోటీల సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉందని, అందుకే అన్ని ఈవెంట్ల నుంచి రష్యాను బహిష్కరించాలని నిర్ణయించింది. రష‌యా జెండాను కూడా వాడకూడదని అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ పేర్కొంది. అలాగే ఈ ఏడాది జరగనున్న సాకర్ వరల్డ్ కప్ నుంచి కూడా ఫిఫా రష్యాను బహిష్కరించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ అన్ని ఈవెంట్లలోనూ రష్యా ఆటగాళ్లకు నో ఎంట్రీ చెప్పేసింది.


Tags:    

Similar News