Ukraine War : ప్రతిఘటిస్తున్న ప్రజలు.. రష్యా సైన్యానికి చుక్కెదురు
రష్యా సైనికులకు ఉక్రెయిన్ ప్రజలు తిరుగుబాటు మింగుడు పడటం లేదు. ప్రజలు స్వచ్ఛందంగా యుద్ధంలో పాల్గొంటున్నారు.
రష్యా సైనికులకు ఉక్రెయిన్ ప్రజలు తిరుగుబాటు మింగుడు పడటం లేదు. ప్రజలు స్వచ్ఛందంగా యుద్ధంలో పాల్గొంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆయుధాలతో ప్రజలు రష్యా సైనికులను అడ్డుకుంటున్నారు. పెట్రోలు, కాక్ టైల్ బాంబులతో దాడి చేస్తున్నారు. దీంతో ఉక్రెయిన్ లోకి ప్రవేశించడానికి రష్యా సేనలు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ఊహించని రీతిలో ప్రజలు ప్రతిఘటన చేయడం రష్యా సైనికులు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు.
దేశాన్ని రక్షించుకుందామని...
దేశాన్ని రక్షించుకుందామని ఇప్పటికే పలుమార్లు ఉక్రెయిన్ అధ్యక్షడు జెలెన్ స్కీ పిలుపునిచ్చారు. జెలెన్ స్కీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు వీధుల్లోకి వచ్చి రష్యా సైనికులతో పోరాడుతున్నారు. ఉక్రెయిన్ లోని ఇంథన కేంద్రాలు, సైనికస్థావారాలనే లక్ష్యంగా రష్యా దాడులకు దిగుతుంది. ఉక్రెయిన్ లోకి ప్రవేశిస్తున్న రష్యా యుద్ధట్యాంకులకు అడ్డంగా నిలబడి ఉక్రెయిన్ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
198 మంది పౌరులు....
ఇప్పటికే తమ పౌరులు 198 మంది మరణించారని ఉక్రెయిన్ అధికారికంగా తెలిపింది. అయితే మెలిటోపాల్ నగరం తమ అధీనంలోకి వచ్చిందని రష్యా ప్రకటించుకుంది. మొత్తం మీద ఉక్రెయిన్ లో సైన్యం, ప్రజలు రష్యాకు ధీటుగా సమాధానం ఇస్తుండటంతో నగరాల్లోకి ప్రవేశించడానికి రష్యన్లకు అంత సులువగా కన్పించడం లేదు. చివరకు మహిళలు సయితం పోరాటంలో పాల్గొంటున్నారు.