Ukranie War : అక్కడ పెట్రోలు రేటు ఎంతో తెలుసా?

ఉక్రెయిన్ - రష్యా యుద్ధం దెబ్బకు పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. శ్రీలంకలో రికార్డు స్థాయిలో పెట్రోలు ధరలు పెరిగాయి.

Update: 2022-02-27 02:52 GMT

ఉక్రెయిన్ - రష్యా యుద్ధం దెబ్బకు పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. శ్రీలంకలో రికార్డు స్థాయిలో పెట్రోలు ధరలు పెరిగాయి. పెట్రోలు లీటరకు ఇరవై రూపాయలు, డీజిల్ లీటరకు పదిహేను రూపాయలు ప్రభుత్వం పెంచింది. దీంతో శ్రీలంకలో లీటరు పెట్రోలు ధర 204కు చేరుకుంది. అలాగే లీటరు డీజిల్ ధర 139 రూపాయలకు చేరుకుంది. యుద్ధం కారణంగా పెట్రోలు ధరలు పెంచామని ప్రభుత్వం చెబుతోంది.

మిగిలిన ధరలు...
రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం మొదలయి మూడు రోజులు కాలేదు. అప్పుడే ప్రపంచ దేశాలలో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. పెట్రోలు ధరలను ఇప్పటికే పెంచాలని దాదాపు చాలా దేశాలు నిర్ణయించాయి. దీంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం లేదు. గ్యాస్ నుంచి నూనెల వరకూ అన్ని ధరలు పెరిగే అవకాశాలను కొట్టిపారేయలేమంటున్నారు మార్కెట్ నిపుణులు.


Tags:    

Similar News