అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లో ప్రసవించిన మహిళ
రష్యా సైనికుల బాంబు దాడుల నుంచి ప్రాణాలతో బయటపడేందుకు కీవ్ నగరంలో స్థానికులు అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లో..
ఉక్రెయిన్ : రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం మూడవ రోజుకి చేరింది. అక్కడి భయానక వాతావరణం ఆ దేశ పౌరులను వణికిస్తున్నాయి. చూస్తూంటే యుద్ధం భీకర స్థాయికి చేరేలా కనిపిస్తోంది. వరుసగా మూడో రోజు ఉక్రెయిన్ రాజధాని అయిన కీవ్ నగరంపై బాంబుల దాడి కొనసాగుతోంది. రష్యా సైనికుల బాంబు దాడుల నుంచి ప్రాణాలతో బయటపడేందుకు కీవ్ నగరంలో స్థానికులు అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లో తలదాచుకుంటున్నారు. అలా మెట్రో స్టేషన్లో తలదాచుకున్న ఓ గర్భిణీ అక్కడే ప్రసవించింది.
Also Read : చావనైనా చస్తా... కాని పారిపోను
ఆమె ఒక బేబీకి జన్మనిచ్చిందని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. రష్యా - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఉక్రెయిన్ పౌరుల ప్రాణాలమీదికి వచ్చింది. అండర్ గ్రౌండ్ లో ఉన్నవారు బయటికి వస్తే.. ఏ బాంబుకి బలవుతామో అని బిక్కుబిక్కుమంటూ.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలియక.. సహాయం చేసేవారి కోసం బిక్కమొహాలతో ఎదురుచూస్తున్నారు. మెట్రో స్టేషన్‌లనే బంకర్లుగా వాడుతున్న స్థానికులు ప్రస్తుతం టెలిగ్రామ్ యాప్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు.