Ukrain War : పది రోజులు ఆగండి.. ధరల మోత మోగుతుంది
ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధంతో ధరల పెరుగుదల విపరీతంగా ఉండనుంది. భారత్ పై కూడా దాని ప్రభావం చూపనుంది.
ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధంతో ధరల పెరుగుదల విపరీతంగా ఉండనుంది. భారత్ పై కూడా దాని ప్రభావం చూపనుంది. నిన్నటి వరకూ క్రూడాయిల్ ధర 100 డాలర్లు ఉంటే, ఈరోజు దాని ధర `111 డాలర్టకు చేరుకుంది. దీంతో పెట్రోలు ఉత్పత్తుల ధరలు మరింత పెరిగే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసమే పెట్రోలు ధరలు పెంచకుండా ఆగింది. మార్చి పదో తేదీ నుంచి పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశముంది.
బంగారం ధరలు.....
ఇక బంగారం ధరలు ఇప్పటికే పెరిగాయి. 24 క్యారెట్ల పదిగ్రాముల బంగారం 51 వేల రూపాయలకు చేరుకుంది. గ్రాముకు వంద రూపాయలు పెరిగింది. బంగారం ధర రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు పామాయిల్ ధరలు మరింత పెరగనున్నాయి. రష్యా, ఉక్రెయిన్ ల నుంచి ఎక్కువగా సన్‌ఫ్లవర్ ఆయిల్ ను దిగుమతి చేసుకుంటాం. లక్షల టన్నుల్లో సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి నిలిచిపోవడంతో వీటి ధర మరింత పెరిగే అవకాశముంది.