Ukraine Crisis : వార్ ఎఫెక్ట్ : భారీగా పెరిగిన ముడి చమురు ధర
ఉక్రెయిన్ పై రష్యా సైనిక దాడులకు దిగడంతో క్రూడాయిల్ ధర బాగా పెరిగింది. బ్యారల్ కు వంద డాలర్లకు చేరుకుంది
ఉక్రెయిన్ పై రష్యా సైనిక దాడులకు దిగడంతో క్రూడాయిల్ ధర బాగా పెరిగింది. బ్యారల్ కు వంద డాలర్లకు చేరుకుంది. యుద్ధం మొదలు కావడంతో పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం కన్పిస్తుంది. ఇప్పటికే ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్యకు దిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు తెల్లవారు జాము నుంచే కాల్పులను రష్యా సైనికులు ప్రారంభించారు. ఇప్పటికే ఉక్రెయిన్ లోని ఎయిర్ బేస్ ను ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది.
మొదటి రోజునే....
అయితే రష్యా -ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం మొదలు కావడతంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. యుద్ధం ప్రారంభమయిన మొదటి రోజే క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగ భారీగా పెరగడం ఇబ్బందిగా మారనుంది. ముడి చమురు ధర భారీ పెరగడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది.