ఉక్రెయిన్ కు మద్దతుగా నటి ప్రియాంక చోప్రా పోస్ట్
ఉక్రెయిన్ లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. అమాయక ప్రజలు తమతోపాటు, తమ వారి ప్రాణాల గురించి ఆందోళన చెందుతున్నారు...
ముంబై : ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది. నిన్నటి నుంచి రష్యా ఉక్రెయిన్ పై వరుస దాడులు చేస్తోంది. తొలిరోజు యుద్ధంలో 137 మంది సైనికులను పోగొట్టుకున్నామని, తమ దేశాన్ని అందరూ ఒంటరిని చేశారంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భావోద్వేగానికి గురయ్యారు. మరోవైపు ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితులు నెట్టింట్లో వీడియోల రూపంలో బయపడుతున్నాయి. ఆ వీడియోలు ప్రపంచ దేశాలను కంటతడి పెట్టిస్తున్నాయి. ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపాలని ప్రపంచ దేశాలు రష్యాకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నటి ప్రియాంక చోప్రా ఉక్రెయిన్ ప్రజలకు మద్దతు పలికింది. అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తెలియజేసే ఒక వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ పేజ్ పై పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఉక్రెయిన్ ప్రజలు ప్రాణ భయంతో సబ్ వే స్టేషన్లు, బంకర్లలో తలదాచుకోవడం అందులో కనిపిస్తుంది.