Ukraine Crisis : పట్టుబిగిస్తున్న రష్యా.. తొలిరోజు యుద్ధంలో?

రష్యా తొలిరోజు పై చేయి సాధించింది. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాల్లోకి రష్యా సైన్యం ప్రవేశించింది

Update: 2022-02-25 01:56 GMT

రష్యా తొలిరోజు పై చేయి సాధించింది. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాల్లోకి రష్యా సైన్యం ప్రవేశించింది. దీంతో పాటు చెర్నోబిల్ లో ఉన్న అణ విద్యుత్తు కర్మాగారాన్ని రష్యా సైనికులు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఉక్రెయిన్ రాజధాని అయిన కీవ్ కు 130 కిలోమీటర్ల దూరంలో ఉండే చెర్నోబిల్ అణువిద్యుత్తు కర్మాగారం తమ వశమయినట్లు రష్యా అధికారికంగా ప్రకటించింది. దీనిపై ఉక్రెయిన్ కూడా ధృవీకరించింది. రష్యా వరస బాంబులతో దాడి చేయడం వల్ల రేడియో ధార్మిక వ్యర్థాల నిల్వలపైనా పడ్డాయని, దాని ప్రభావం రేడియో ధార్మికత స్థాయి పెరిగిందని చెబుతున్నారు.

137 మంది....
తొలిరోజు యుద్ధంలో 137 మంది సైనికులు, పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్ అద్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. అన్ని నగరాలను రష్యా సేనలు చుట్టుముడుతున్నాయని చెప్పారు. అయినా తమ పోరాటం ఆగదని ఆయన తెలిపారు. మరో 90 రోజుల పాటు బలగాల మొహరింపు ఉంటుదని జెలెన్ స్కీ స్పష్టం చేశారు. ప్రధానంగా సైనిక స్థావరాలు, ఆయుధ కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులకు దిగుతుంది.
ప్రధాన నగరాలు లక్ష్యంగా....
దీంతో ఉక్రెయిన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొందరు దేశంలో ఉన్న సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు. అయితే ఉక్రెయిన్ సైన్యం కూడా దీటుగానే తిప్పికొడుతుంది. కీవ్ సమీపంలో సైనిక విమానం కూలిపోవడంతో 14 మంది చనిపోయారు. ఇప్పటి వరకూ ఉక్రెయిన్ కు చెందిన 40, రష్యాకు చెందిన 50 మంది సైనికులతో పాటు పౌరులు కూడా చనిపోయారని అధికార వర్గాలు చెబుతన్నాయి. తొలుత ఆకాశమార్గం ద్వారా దాడులు చేసిన రష్యా తర్వాత సైనికులను క్రమంగా ఉక్రెయిన్ లోకి పంపగలిగింది. ప్రధాన నగరాలకు చేరువలో రష్యా ఆర్మీ ఉంది.


Tags:    

Similar News