బ్రేకింగ్ : కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా
ఉక్రెయిన్ లో కాల్పుల విరమణను రష్యా ప్రకటించింది. ప్రపంచదేశాల వత్తిడితో రష్యా ఈ నిర్ణయం తీసుకుంది
ఉక్రెయిన్ లో కాల్పుల విరమణను రష్యా ప్రకటించింది. ప్రపంచదేశాల వత్తిడితో రష్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఐదు గంటల పాటు కాల్పుల విరమణ పాటిస్తామని రష్యా పేర్కొంది. ఉక్రెయిన్ లో వివిధ దేశాలకు చెందిన ప్రజలు ఉన్నారు. వారిని తరలించడం ఆ దేశాలకు సాధ్యం కావడం లేదు. దీంతో రష్యాపై వత్తిడి పెరిగింది. భారత్ కు చెందిన దాదాపు రెండు వేల మంది ఇంకా ఉక్రెయిన్ లోనే చిక్కుకుపోయి ఉన్నారు.
ఐదు గంటల విరామం....
ఉక్రెయిన్ కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటల నుంచి ఈ కాల్పుల విరమణను పాటిస్తామని రష్యా ప్రకటించింది. దీంతో ఇతర దేశాల ప్రజలు సులువుగా సరిహద్దు ప్రాంతాలకు చేరుకునే అవకాశముంటుంది. అందుకే వివిధ దేశాల ప్రజలు యుద్ధం బారిన పడకుండా విరామాన్ని ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి, మానవహక్కుల కమిషన్ కు చెప్పినట్లే రష్యా యుద్ధాన్ని స్వల్ప కాలం విరమిస్తున్నట్లు ప్రకటించింది.