Ukraine War : రష్యా మరోసారి కాల్పుల విరమణ ప్రకటన

రష్యా మరోసారి కాల్పుల విరమణను ప్రకటించింది. ఉక్రెయిన్ లో ఉన్న విదేశీయులను తరలించేందుకు రష్యా ఈ నిర్ణయం తీసుకుంది.;

Update: 2022-03-08 02:40 GMT
ukraine war, russia,  ceasefire, foreigners
  • whatsapp icon

రష్యా మరోసారి కాల్పుల విరమణను ప్రకటించింది. ఉక్రెయిన్ లో ఉన్న ఇతర దేశాలకు చెందిన వారిని తరలించేందుకు రష్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండుసార్లు రష్యా యుద్ధ విరామాన్ని ప్రకటించింది. ప్రధాన నగరాల్లో కొన్ని గంటల పాటు కాల్పులకు విరామం ప్రకటించింది. నిన్న ఐదు గంటల పాటు కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా నేడు విదేశీయుల తరలింపునకు మరోసారి అవకాశమిస్తున్నట్లు పేర్కొంది.

ఈరోజు 9 గంటల నుంచి....
భారత కాలమానం ప్రాకరం ఉదయం 9 గంటల నుంచి కాల్పుల విరమణను పాటిస్తున్నట్లు తెలిపింది. ఈ సమయంలో విదేశీయులను తరలించాల్సిందిగా కోరింది. అయితే రష్యా ప్రతిపాదనను ఉక్రెయిన్ తిరస్కరించినట్లు తెలిసింది. కాల్పుల విరమణకు తాము అంగీకరించబోమని ఉక్రెయిన్ స్పష్టం చేసింది.


Tags:    

Similar News