Ukraine War : మూడోసారి చర్చలకు సిద్ధం
రష్యా - ఉక్రెయిన్ చర్చలు ఇప్పటికి రెండు సార్లు విఫలమయ్యాయి. దీంతో మూడోసారి చర్చలు జరపాలని ఉక్రెయిన్ భావిస్తుంది.
రష్యా - ఉక్రెయిన్ చర్చలు ఇప్పటికి రెండు సార్లు విఫలమయ్యాయి. దీంతో మూడోసారి చర్చలు జరపాలని ఉక్రెయిన్ భావిస్తుంది. యుద్ధాన్ని నివారించడానికి చర్చలే మార్గమని ఉక్రెయిన్ ఒక నిర్ణయానికి వచ్చి మూడోసారి చర్చలకు తాము సిద్ధమని ప్రకటించింది. ఇప్పటికే బెలారస్ లో రెండుసార్లు ఇరు దేశాల విదేశాంగ ప్రతినిధుల సమక్షంలో చర్చలు జరిగాయి. అయితే యుద్ధం ఆపి చర్చలు ప్రారంభించాలని ఉక్రెయిన్, నాటోలో చేరబోమని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రష్యా షరతులు విధించాయి.
రెండు, మూడు రోజుల్లో....
అయితే రెండుసార్లు చర్చలు ఫలప్రదం కాలేదు. ఎలాంటి పురోగతి లేకుండానే ముగిశాయి. మరో వైపు రష్యా దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఉక్రెయిన్ దానిని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. మూడోసారి చర్చలు జరపేందుకు తాము సిద్దమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సలహాదారు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో చర్చలు ప్రారంభమయ్యే అవాకాశముందని ఆయన తెలిపారు.