Ukarin War : ఏడో రోజు యుద్ధం.. భయానకమే
ఉక్రెయిన్ పై ఏడో రోజు యుద్ధం రష్యా కొనసాగిస్తుంది. ప్రధాన నగరాలైన కీవ్, ఖర్కివ్ లపైనే క్షిపణులతో దాడులకు దిగింది.
ఉక్రెయిన్ పై ఏడో రోజు యుద్ధం రష్యా కొనసాగిస్తుంది. ప్రధాన నగరాలైన కీవ్, ఖర్కివ్ లపైనే క్షిపణులతో దాడులకు దిగింది. దీంతో పదుల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ దాడుల్లో 14 మంది చిన్నారులు, 352 మంది పౌరులు మరణించినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఇప్పటికే ఉక్రెయిన్ నుంచి దాదాపు ఆరున్నర లక్షల మంది పౌరులు దేశాన్ని వీడినట్లు పేర్కొంది. వీరంతా సరిహద్దు దేశాలకు తరలి వెళ్లారు.
భవనాలు నేలమట్టం...
ఖర్కివ్ లోని ఫ్రీడం స్వ్కేర్ పూర్తిగా ధ్వంసమయింది. సోవియట్ యూనియన్ కాలంలోనూ ఈ భవనం పరిపాలన కేంద్రంగా కొనసాగుతుంది. రష్యా దాడుల్లో కీవ్ నగరంలోని టీవీ టవర్ కూడా పూర్తిగా ధ్వంసమయింది. ఈ దాడిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కీవ్ వైపు ట్యాంకులు, మరఫిరంగులతో రష్యా సైన్యం దూసుకొస్తుంది. రష్యా సైన్యాన్ని నిలువరించేందుకు ఉక్రెయిన్ భద్రతాదళాలు శక్తివంచన లేకుండా పోరాడుతున్నాయి.