Ukrain War : ఆ గుర్తు ఉంటే భవనం మాటాష్
ఉక్రెయిన్ పై రష్యా ముప్పేట దాడులకు దిగుతుంది. నివాస భవనాలపైన కూడా క్షిపణులతో దాడులు చేస్తుంది.
ఉక్రెయిన్ పై రష్యా ముప్పేట దాడులకు దిగుతుంది. నివాస భవనాలపైన కూడా క్షిపణులతో దాడులు చేస్తుంది. పదుల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. అయితే తాజాగా ఎర్రరంగుతో X మార్క్ ఉన్న గుర్తు ఉంటే ఆ భవనం నేలమట్టం అవుతున్నట్లు ఉక్రెయిన్ అధికారులు గుర్తించారు. ప్రధానంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఖర్కివ్ నగరాల్లోని అనేక భవనాలపై ఈ గుర్తులు ఉన్నట్లు ఉక్రెయిన్ అధికారులు గుర్తించారు.
మైకుల్లో ప్రకటనలు....
ఈ గుర్తులు ఎవరు? ఎలా పెట్టారో? తెలియడం లేదు. అయితే X మార్క్ గుర్తు ఉన్న భవనాలను వెంటనే ఖాళీ చేయాలని ఉక్రెయిన్ అధికారులు కోరుతున్నారు. రష్యా ఆ భవనాలపై దాడి చేస్తుందని మైకుల ద్వారా ప్రకటనలు చేస్తున్నారు. ఈ గుర్తులు ఉక్రెయిన్ ప్రభుత్వ భవనాలతో పాటు నివాస భవనాలపై కూడా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ గుర్తు ఉన్న భవనాల నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.