Ukraine War : కీవ్ ఇంకా చేతికి దొరకలేదు

ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు రష్యా సైనికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు;

Update: 2022-03-05 01:39 GMT
ukraine war, russia, kyiv city, bomb blasts
  • whatsapp icon

ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు రష్యా సైనికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఉక్రెయిన్ పౌరులు, సైన్యం అడ్డుకుంటుండటంతో సాధ్యపడటం లేదు. దీంతో రష్యా కీవ్ నగరంపై క్షిపణులతో దాడికి దిగుతుంది. కీలకమైన ఖర్కివ్ నగరంలోనూ వరస పేలుళ్లు సంభవించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బంకర్లలోకి వెళ్లి కొందరు తలదాచుకున్నారు.

స్వాధీనం చేసుకునేందుకు....
కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడానికి రష్యా గత తొమ్మిది రోజులుగా ప్రయత్నిస్తూనే ఉంది. బాంబులతో మోతెక్కిస్తుంది. ప్రతి పది నిమిషాలకు ఒకసారి బాంబుల మోత విన్పిస్తుంది. ఇప్పటికే పౌరులు కీవ్ నగరాన్ని దాదాపుగా ఖాళీ చేసి వెళ్లిపోయారు. నివాస ప్రాంతాలపై కూడా బాంబు దాడులు చేస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతుంది.


Tags:    

Similar News