కొనసాగుతున్న దాడులు.. నేడు మరోసారి కాల్పుల విరమణ
ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నగరాలను టార్గెట్ గా చేసుకుని రష్యా సైన్యం బాంబులతో దాడులు చేస్తుంది.
ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధాన నగరాలను టార్గెట్ గా చేసుకుని రష్యా సైన్యం బాంబులతో దాడులు చేస్తుంది. దీంతో ప్రజలు భయాందోళనలతో పరుగులు తీస్తున్నారు. నివాస ప్రాంతాలపై కూడా బాంబులు పడుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా సుమీ నగరంలో రష్యా సైనికులు బాంబు దాడులు చేశారు. ఈ దాడిలో పది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.
భారత విద్యార్థులను....
ఇక అక్కడ ఉన్న రెండు చమురు డిపోలను కూడా రష్యా సైన్యం ధ్వంసం చేసింది. రష్యా బలగాలను ఎక్కడికక్కడ ఉక్రెయిన్ సైనికులు, పౌరులు అడ్డుకుంటున్నా బాంబుల మోత మాత్రం ఆగడం లేదు. మరో వైపు సుమీ నుంచి అక్కడ చిక్కుకుపోయిన విద్యార్థులను భారత్ ప్రభుత్వం సురక్షితంగా తరలించింది. ఈరోజు కూడా విదేశీయుల తరలింపు కోసం రష్యా కాల్పుల విరమణను ప్రకటించింది.