బాంబుల మోత... దద్దరిల్లుతున్న నగరాలు

ఉక్రెయిన్ పై రష్యా బాంబు దాడులతో యుద్ధానికి కొనాసాగిస్తుంది. ముఖ్యంగా ఖర్కివ్ నగరం వరస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోతుంది

Update: 2022-03-03 08:58 GMT

ఉక్రెయిన్ పై రష్యా బాంబు దాడులతో యుద్ధానికి కొనాసాగిస్తుంది. ముఖ్యంగా ఖర్కివ్ నగరం వరస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోతుంది. క్షిపణులు, ఫిరంగులతో దాడులకు దిగుతుండటంతో పౌరులు భయాందోళనలతో బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు తొమ్మిది లక్షల మంది పౌరులు ఉక్రెయిన్ నుంచి వలస వెళ్లిపోయినట్లు ఐక్యారాజ్యసమితి వెల్లడించింది.

క్వాడ్ నేతల సమావేశం...
మరోవైపు రాజధాని నగరంలోని కీవ్ లోని డ్రుబీ నరోదివ్ మెట్రో స్టేషన్ సమీపంలో బాంబు పేలుళ్లు జరగడంతో ప్రజలు పరుగులు తీశారు. మరోవైపు క్వాడ్ నేతలు సమావేశమై ఉక్రెయిన్ సంక్షోభం పై చర్చించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని పుమియో కిషిదాలు వర్చువల్ గా సమావేశం కానున్నారు. క్వాడ్ ప్రణాళికలో భాగంగా ఇండో-ఫసిఫిక్ కు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై వీరు సమీక్ష చేస్తారు. ప్రధానంగా ఉక్రెయిన్ - రష్యా యుద్ధం, జరుగుతున్న పరిణామాలపై చర్చించనున్నారు.


Tags:    

Similar News