Ukraine War : ఉక్రెయిన్ భూభాగం అవసరం లేదు.. రష్యా కీలక ప్రకటన

రష్యా విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. తాము ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవాలని అనుకోవడం లేదని పేర్కొంది.

Update: 2022-02-26 04:38 GMT

రష్యా విదేశాంగ శాఖ కీలక ప్రకటన చేసింది. తాము ఉక్రెయిన్ ను ఆక్రమించుకోవాలని అనుకోవడం లేదని పేర్కొంది. సైనిక చర్య పూర్తయిన వెంటనే తమ బలగాలను వెనక్కు రప్పిస్తామని పేర్కొంది. ఉక్రెయిన్ లో పౌరుల సంక్షేమం కోసమే తాము సైనిక చర్యలను చేపట్టినట్లు తెలిపింది. అలాగే ఉక్రెయిన్ లో తాము కొత్త ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. ఉక్రెయిన్ భూభాగం తమకు అవసరం లేదని పేర్కొంది. అణిచి వేతల నుంచి ఉక్రెయిన్లు విముక్తి పొందాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ఉక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లో రష్యా ఆక్రమించదని తేల్చి చెప్పింది.

మూడో రోజు.....
మరోవైపు రష్యా సేనలు మూడోరోజు యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. చెర్నోబిల్ అణు విద్యుత్తు కేంద్రాన్ని ఆక్రమించుకున్నాయి. ఈ సందర్భంగా పెద్దయెత్తున పేలుళ్లు సంభవించాయి. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోకి రష్యా బలగాలు ప్రవేశించి నగరాన్ని హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి.


Tags:    

Similar News