Ukraine War : సుమీలో ఉన్నాం .. కాపాడండి
కొందరు భారతీయ విద్యార్థులు భయంతో సుమీ పట్టణానికి చేరుకున్నారు. ఇది రష్యా సరిహద్దులకు అతి కొద్ది దూరంలోనే ఉంది
ఉక్రెయిన్ లో ఉన్న భారతీయ విద్యార్థులను తరలించే ప్రక్రియ వేగవంతమయింది. ప్రత్యేక విమానాల్లో ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి విద్యార్థులను తరలిస్తున్నారు. అయితే ఉక్రెయిన్ పశ్చిమ వైపు మాత్రమే ప్రయాణం చేయాలని భారత రాయబార కార్యాలయం పదే పదే చెబుతుంది. కానీ కొందరు విద్యార్థులు భయంతో సుమీ పట్టణానికి చేరుకున్నారు. ఇది రష్యా సరిహద్దులకు అతి కొద్ది దూరంలోనే ఉంది.
రష్యా నుంచి తరలించాలని....
తమను రష్యా నుంచి భారత్ కు తరలించాలని విద్యార్థులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తాము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేయలేని పరిస్థితి నెలకొని ఉందని వారు చెబుతున్నారు. సుమీ పట్టణం నుంచి రెండు గంటల్లో రష్యా సరిహద్దులకు చేరుకోవచ్చని, తమను అక్కడి నుంచి భారత్ కు తీసుకెళ్లాలని విద్యార్థులు అభ్యర్థిస్తున్నారు. ఉక్రెయిన్ లో భీకర యుద్ధం జరుగుతుండటంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు.