Ukrain War : రష్యా - ఉక్రెయిన్‌ల మధ్య చర్చలు విఫలం?

రష్యా - ఉక్రెయిన్ ల మధ్య చర్చలు విఫలమయ్యాయి. రష్యా బలగాలను వెనక్కు తీసుకోవాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది.

Update: 2022-02-28 15:10 GMT

రష్యా - ఉక్రెయిన్ ల మధ్య చర్చలు విఫలమయ్యాయి. రష్యా బలగాలను వెనక్కు తీసుకోవాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది. అదే సమయంలో నాటోలో చేరబోమని ఉక్రెయిన్ లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని రష్యా షరతు విధించింది. అయితే నాటో లో చేరడంపై ఉక్రెయిన్ లిఖితపూర్వకంగా ఇవ్వడానికి ఇష్పపడలేదు. దీంతో ఉక్రెయిన్ - రష్యాల మధ్య చర్చలు విఫలమయ్యాయని తెలుస్తోంది.

షరతులు కారణంగానే...
ఈరోజు రష్యా - ఉక్రెయిన్ ల మధ్య చర్చలు బెలారస్ లో ప్రారంభమయ్యాయి. రెండు దేశాలకు చెందిన విదేశాంగ అధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. అయితే చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.


Tags:    

Similar News