Ukraine war : రేపు మరోసారి శాంతి చర్చలు

రేపు రష్యా - ఉక్రెయిన్ ల మధ్య చర్చలు జరగనున్నాయి. మూడో సారి జరగనున్న చర్చలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Update: 2022-03-06 04:40 GMT

రేపు రష్యా - ఉక్రెయిన్ ల మధ్య చర్చలు జరగనున్నాయి. మూడో సారి జరగనున్న చర్చలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే బెలారస్ లో రెండు దఫాలు చర్చలు జరిగినా అసంతృప్తిగా ముగిశాయి. ఇరు దేశాలు షరతులు విధించడంతో చర్చలు ముందుకు సాగలేదు. దీంతో మరోసారి చర్చలకు సిద్ధమయింది ఉక్రెయిన్. రష్యా కూడా అందుకు అంగీకారం తెలిపింది. రేపు జరిగే చర్చల్లో సానుకూల ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు.

వెనక్కు తగ్గేది లేదు....
అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ప్రపంచ దేశాలకు ఆయన హెచ్చరికలు పంపారు. రష్యాపై ఆంక్షలు విధించడమంటే యుద్ధంలో పాల్గొన్నట్లేనని పుతిన్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ గగనతలంలో నో ఫ్లై జోన్ గా ప్రకటిస్తే యుద్ధానికి దిగినట్లేనని ఆయన తెలిపారు. మొత్తం మీద రేపు జరిగే చర్చలపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.


Tags:    

Similar News