Ukraine War : రెండు విడత చర్చలు మరికాసేపట్లో?

ఉక్రెయిన్ - రష్యా మధ్య చర్చలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. చర్చలు జరపుతామని రష్యా చెప్పింది.

Update: 2022-03-03 12:22 GMT

ఉక్రెయిన్ - రష్యా మధ్య చర్చలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. చర్చలు జరపుతామని రష్యా చెప్పింది. అయితే యుద్ధం ఆపితేనే చర్చలకు వస్తామని ఉక్రెయిన్ తేల్చింది. దీంతో రెండో విడత జరగాల్సిన చర్చలు జరగలేదు. అయితే చివరకు రష్యా మరోసారి చర్చలకు సిద్ధమయింది. దీంతో ఉక్రెయిన్ కూడా చర్చలకు సిద్ధమయింది.

ఇరు దేశాల షరతులు....
మరికాసేపట్లో బెలారస్ లో ఉక్రెయిన్ - రష్యా విదేశాంగ అధికారులు ఈ చర్చల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే యుద్ధం ఆరంభమై వారం రోజులకు పైగానే అయింది. రెండు దేశాలకు ఇప్పటికే పెద్దయెత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. దోనాస్క్, ల్యూనిస్క్ లను రష్యా వదిలేయాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తుంది. చర్చలు జరుగుతున్నా దాడులు కొనసాగుతాయని రష్యా స్పష్టం చేసింది. మరో రెండుగంటల్లో ఇరు దేశాల మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధాన్ని ఆపి చర్చలు కొనసాగించాలని ఉక్రెయిన్ కోరుతుండగా, తమ డిమాండ్లకు ఓకే చెబితేనే యుద్ధం ఆగుతుందని రష్యా స్పష్టం చేసింది.


Tags:    

Similar News