Ukraine War : రేపు మరోసారి చర్చలు.. రష్యా కొత్త షరతు
రేపు ఉక్రెయిన్ - రష్యాల మధ్య మరోసారి చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈసారి టర్కీలో ఈ చర్చలు జరగనున్నాయి
రేపు ఉక్రెయిన్ - రష్యాల మధ్య మరోసారి చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈసారి టర్కీలో ఈ చర్చలు జరగనున్నాయి. నాలుగో విడత ఈ చర్చలు జరుగుతున్నాయి. నాటోలో చేరబోమని ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి చర్చలు ఫలవంతమవుతాయిని భావిస్తున్నారు. గత మూడుసార్లు బెలారస్ లో చర్చలు జరిగాయి. ఈసారి మాత్రం టర్కీలో జరగనున్నాయి.
రష్యా కొత్త షరతు....
అయితే రష్యా మాత్రం కొత్త షరతు విధించే అవకాశం కనపడుతుంది. జెలెన్ స్కీ తమకు లొంగి పోవాలని రష్యా అడుగుతోంది. జెలెన్ స్కీ లొంగిపోతేనే యుద్ధాన్ని ఆపుతామని రష్యా షరతు పెట్టనుంది. నాటో లో తమకు సభ్యత్వం అవసరం లేదని చెప్పిన జెలెన్ స్కీ రష్యా పెడుతున్న ఈ షరతుకు అంగీకరిస్తారా? లేదా? అన్నది చూడాలి.