Ukraine War : మరోసారి రష్యా కాల్పుల విరమణ
ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా కాల్పుల విరమణను మరోసారి నేడు రష్యా ప్రకటించింది.
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగుతుంది. అయితే ఈరోజు కాల్పుల విరమణను రష్యా ప్రకటించింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా కాల్పుల విరమణను రష్యా ప్రకటించింది. గత కొద్ది రోజులుగా సాగుతున్న యుద్ధంలో అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రష్యా అంతర్జాతీయ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో రష్యాపై ఆంక్షలను కొనసాగించాలని అనేక దేశాలు నిర్ణయించాయి.
అంతర్జాతీయ వత్తిడులతో...
ీదీంతో దిగి వచ్చిన రష్యా అంతర్జాతీ వత్తిడులను తట్టుకునేందుకు కాల్పుల విరమణను ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి కాల్పుల విరమణను పాటిస్తారు. ఉక్రెయిన్ లోని నాలుగు నగరాల్లో కాల్పుల విరమణను పాటిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్ లోని సుమి, ఖర్వీవ్, కీవ్, మరియాపోల్ నగరాల్లో కాల్పుల విరమణను రష్యా ప్రకటించింది.