Ukraine War : మరోసారి శాంతి చర్చలు
రష్యా- ఉక్రెయిన్ ల మధ్య రెండో విడత చర్చలకు ఇరు దేశాలు ముందుకొచ్చాయి. మరసారి చర్చలు జరపాలని ఇరు దేశాలు నిర్ణయించారు
రష్యా- ఉక్రెయిన్ ల మధ్య రెండో విడత చర్చలకు ఇరు దేశాలు ముందుకొచ్చాయి. మరసారి శాంతి చర్చలు జరపాలని ఇరు దేశాల ప్రతినిధులు నిర్ణయించారు. ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగిస్తుండటం, యూరోపియన్ యూనియన్ లో ఉక్రెయిన్ కు మద్దతు దొరకడం వంటి కారణాలతో మరోసారి శాంతి చర్చలు జరపాలని నిర్ణయించాయి.
షరతులతో....
నిన్న బెలారస్ లో జరిగిన చర్చలు అసంతృప్తిగా ముగిశాయి. ఉక్రెయిన్ నుంచి రష్యా దళాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆ దేశం డిమాండ్ చేసింది. అదే సమయంలో రష్యా కూడా నాటోలో సభ్యత్వం స్వీకరించబోమని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రష్యా షరతు విధించింది. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. కానీ ఈరోజు ఇరు దేశాలు మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించాయి.