Ukraine War : చావనైనా చస్తా... కాని పారిపోను
ఉక్రెయిన్ అద్యక్షుడు జెలెన్ స్కీ దేశంలోనే ఉండి రష్యా సైనికులతో పోరాడటానికి నిశ్చయించుకున్నారు
ఉక్రెయిన్ అద్యక్షుడు జెలెన్ స్కీ దేశంలోనే ఉండి రష్యా సైనికులతో పోరాడటానికి నిశ్చయించుకున్నారు. ఆయన ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోనే ఉండి సైనికులతో కలసి యుద్ధంలో పాల్గొంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లో కీవ్ ను వదులుకోబోమని ఆయన ప్రజలకు చెప్పారు. ఉక్రెయిన్ సైన్యం వీరోచితంగా పోరాడుతుందని, వందల సంఖ్యలో రష్యన్ సైనికులను మట్టుబెట్టిందని పేర్కొన్నాడు. ఈ యుద్ధంలో కొందరు ఉక్రెయిన్ వీరులను కూడా కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. జనావాసాలపై రష్యన్ దాడులను ఆయన ఖండించారు.
అమెరికా సాయాన్ని....
మరోవైపు ఉక్రెయిన్ ను వదిలి రావాల్సిందిగా జెలెన్ స్కీని అమెరికా కోరింది. తమ దళాలు కీవ్ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని అమెరికా పేర్కొన్నా జెలెన్ స్కీ అందుకు తిరస్కరించాడు. తనకు ఆయుధాలు కావాలని, పారిపోవడానికి కాదని ఆయన నిష్కర్షగా అమెరికాకు చెప్పాడు. తనకు పారిపోవానికి ఎవరి సాయం అవసరం లేదని, ఆయుధాలు పంపితే చాలునని జెలెన్ స్కీ పేర్కొన్నాడు. ఇక్కడే ఉండి రష‌్యన్ సైనికులతో పోరాడతానని, అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తానని ఆయన చెప్పడం ఉక్రెయిన్ ప్రజలను భావోద్వేగాలకు లోను చేసింది.