Ukrain War : ఈ 24 గంటలూ అత్యంత క్లిష్టం
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ఐదోరోజుకు చేరుకుంది. దాడులు, ప్రతిదాడులతో భయనాక వాతావరణం ఏర్పడింది
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ఐదోరోజుకు చేరుకుంది. దాడులు, ప్రతిదాడులతో భయనాక వాతావరణం ఏర్పడింది. ఉక్రెయిన్ నివాస భవనాలపై కూడా రష్యా సేనులు బాంబు దాడులకు దిగుతున్నాయి. రాబోయే 24 గంటలూ అత్యంత క్లిషమైనదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. ప్రజలు, సైనికులు ఎదురొడ్డి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. రష్యా సైనికులను ఇప్పటికే 4,500 మందిని మట్టుబెట్టామని, మరో 200 మంది రష్యా సైనికులు తమ చేతుల్లో బందీలుగా ఉన్నారని ఉక్రెయిన్ ప్రకటించింది.
ఆ రెండు నగరాలు...
అయితే ఉక్రెయిన్ లో ప్రధాన నగరాలైన కీవ్, ఖర్కిన్ లను ఆక్రమించుకోవాలని రష్యా సైనికులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ ఉక్రెయిన్ సైనికులు, పౌరులు వాళ్ల ఆటలు సాగనివ్వడం లేదు. అడుగడుగునా అడ్డుకుంటుండటంతో ఈ నగరాలను ఆక్రమించుకోవడం రష్యాకు సాధ్యం కావడం లేదు. ఆలస్యంగా అన్ని దేశాలు ఉక్రెయిన్ కు అండగా నిలుస్తుండటంతో ఉక్రెయిన్ సైన్యం మరింత ఉత్సాహంతో పోరాటం చేస్తుంది.
మంటల్లో భవనాలు...
ఉక్రెయిన్ లో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. అనేక భవనాలు మంటల్లో చిక్కుకుంటున్నాయి. మంటలను ఆర్పివేసేందుకు ప్రజలు, సైనికులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఉక్రెయిన్ లో ఉన్న పరిస్థితులను చూసి భయపడి అనేక మంది పొరుగు దేశాలకు పారిపోతున్నారు. మరో 24 గంటలు గడిస్తేనే కాని పరిస్థితి అంచనా వేయలేమని చెబుతున్నారు. మొత్తం మీద రష్యాకు అనుకున్నంత సులువగా ఉక్రెయిన్ కొరుకుడు పడటం లేదు.