Ukranie War : బంకర్లలోకి వెళ్లిపోండి... ప్రజలకు రష్యా వార్నింగ్
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం తొమ్మిదో రోజుకు చేరుకుంది. రష్యా ఉక్రెయిన్ ప్రజలకు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం తొమ్మిదో రోజుకు చేరుకుంది. రష్యా ఉక్రెయిన్ ప్రజలకు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. బంకర్లలో తలదాచుకోవాలని సూచించింది. ఒడెస్సా, బిలాసెర్ క్వా, వొలిన్ వొబ్లాస్ట్ ప్రాంత వాసులకు ఈ హెచ్చరికలను రష్యా జారీ చేసింది. రష్యా వైమానిక దాడులు పాల్పడే అవకాశముందని తెలిసింది. యుద్ధాన్ని మరింత విస్తృతం చేసి వైమానిక దాడులు చేయాలని భావిస్తుంది.
మూడు నగరాల్లో...
అందుకే ఈ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధాన నగరాలను తమ అధీనంలోకి తెచ్చుకునే ప్రక్రియలో భాగంగా వైమానిక దాడులు పాల్పడేందుకు రష్యా సిద్ధమవుతుంది. ఉక్రెయిన్ వ్యూహాత్మకంగా ప్రజలను వీధుల్లోకి పంపి యుద్ధం చేయిస్తుండటం రష్యాకు మింగుడు పడటం లేదు. అందుకే ఉక్రెయిన్ ప్రజలకు తాజాగా రష్యా ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రాంత ప్రజలు బంకర్లలో తలదాచుకోవాలని కోరింది.