Ukraine Crisis : ప్రజలూ బంకర్లలో దాక్కోండి.. ఉక్రెయిన్ పిలుపు
ప్రజలను బంకర్లలో తలదాచుకోవాలని ఉక్రెయిన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది
ప్రజలను బంకర్లలో తలదాచుకోవాలని ఉక్రెయిన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. జనావాసాలపై రష్యా దాడులకు దిగుతుండటంతో ప్రజలు తమంతట తాము రక్షించుకోవడానికి బంకర్లను ఆశ్రయించాలని ప్రభుత్వం కోరింది. బెలారస్ మీదుగా ఇప్పటికే రష్యా సైన్యం ఉక్రెయిన్ లోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఉక్రెయిన్ బాంబుల మోతతో దద్దరిల్లుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ఎయిర్ పోర్టుకు సమీపంలో రష్యా మిస్సైల్ ను ప్రయోగించింది.
సైనిక స్థావరాలపై....
దీంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. కీవ్, ఖార్కీవ్, ధ్నిప్రో నగరాల్లో సైనిక స్థావరాలపై రష్యా దాడులకు దిగింది. ఉక్రెయిన్ ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసినట్లు రష్యా ఇప్పటికే ప్రకటించింది. రష్యాకు చెందిన ఐదు విమానాలను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఉక్రెయిన్ బాంబుల మోతతో దద్దరిల్లి పోతుంది. ఆకాశమార్గంలో, భూ మార్గంలో దాడులు జరగడంతో అనేక నగరాల్లో కాల్పుల మోత విన్పిస్తుంది.