Ukraine War : భారతీయులు బందీలుగా లేరు
ఉక్రెయిన్ లో భారతీయ విద్యార్థులు ఎవరూ బందీలుగా లేరని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
ఉక్రెయిన్ లో భారతీయ విద్యార్థులు ఎవరూ బందీలుగా లేరని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. విద్యార్థులు బందీగా ఉన్నట్లు తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. కాగా రష్యా ఈ ఆరోపణలు చేసింది. భారతీయ విద్యార్థులను బందీగా పెట్టుకుని ఉక్రెయిన్ యుద్ధంలో లబ్ది పొందే ప్రయత్నం చేస్తుందని రష్యా ఆరోపించింది. అనేక మంది భారతీయులు ఉక్రెయిన్ సైన్యం వద్ద బందీలుగా ఉన్నారని పేర్కొంది.
ఉక్రెయిన్ సహకరిస్తుంది....
అయితే కేంద్ర విదేశాంగ శాఖ మాత్రం అలాంటి వార్తలు నిరాధారమని కొట్టిపారేసింది. తాము ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులతో నిరంతరం టచ్ లో ఉన్నామని పేర్కొంది. ఉక్రెయిన్ ప్రభుత్వం కూడా ఇందుకు సహకరిస్తుందని తెలిపారు. నిన్న ఖార్వివ్ నుంచి విద్యార్థుల బృందం బయలుదేరిందని చెప్పింది. భారతీయుల తరలింపులో సహకరిస్తున్న ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు కూడా విదేశాంగ శాఖ ధన్యవాదాలు తెలిపింది.